సామరస్యానికి సమానత్వానికి దాత్రుత్వానికి ప్రతీక పవిత్ర రంజాన్
వరంగల్,అక్షిత బ్యూరో: ముస్లిం పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఎల్బీనగర్ ఈద్గాలో స్థానిక ఈద్గా అధ్యక్షుడు సాదిక్ పాశ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు నరేందర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గత నెల రోజులుగా ముస్లిం సోదరులు చేస్తున్నటువంటి ఉపవాస దీక్షలు ప్రజాశాంతికి సమాజం అభివృద్ధి కోసం చైతన్యానికి మతసమరస్యానికి ప్రత్యేకగా రంజాన్ పండుగ నిలుస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా 40 లక్షల వ్యయం తో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మేల్యే శంకుస్థాపన చేశారు. వచ్చే రంజాన్ కళ్ళ ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయిస్తామని అన్నారు. మైనారిటీ సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుర్ఖాన్ 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ కుమార్ జోషి ఆజాం అబ్దుల్లా ఆసిఫ్ స్థానిక ముస్లిం మదపెద్దలు స్థానికులు పాల్గొన్నారు.