బదిలీపై వెళ్తున్న అధికారికి సన్మానం
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
ఏరియాలోని ఆర్కే 1ఏ గని డివై మేనేజర్ గా విధులు నిర్వహించి, శ్రీరాంపూర్ ఏరియాకు ఎస్ఓటు జిఎం గా బదిలీపై వెళుతున్న అధికారి శ్రీధర్ కు సోమవారం ఏరియా జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు ఏరియా జిఎం జి మోహన్ రెడ్డి, ఏరియా ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్కే 1ఏ గని డివై మేనేజర్ గా శ్రీధర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏరియాలోని అన్ని గనుల, విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.