*నేటి ప్లీనరీ వేదికపై ఎమ్మెల్యే నరేందర్ పూరించనున్న అసెంబ్లీ ఎన్నికల సమర
శంఖారావం*
వరంగల్ ,అక్షిత బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ.. మంగళవారం నిర్వహించనున్న ప్లీనరీకి ఓ సిటీలో తగు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవుతున్నాయి. అత్యంత ప్రతిష్టా త్మకంగా తూర్పు నియోజకవర్గంలో జరగనున్న ప్రతినిధుల సభను విజయవంతం చేయడా నికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విస్తృత కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు పరుస్తున్నారు. వేయి మంది కార్మికులతో కలుపుకొని ఆరు వేల మంది ప్రతినిధులు సమరో త్సాహంతో పాల్గొనే విధంగా భూమికను సిద్ధం చేశారు. డివిజన్ స్థాయిలో జెండా పండు గను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకొని ఉదయం 9 గంటల వరకు ప్లీనరీ ప్రాంతానికి శ్రేణులు భారీ సంఖ్యలో చేరే విధంగా గత కొద్ది రోజులుగా వివిధ కార్యక్రమాలను చేప ట్టారు. తూర్పు మొత్తం గులాబీమయం చేసే విధంగా తోరణాలు, ఫ్లెక్సీలు, జెండాలతో వివి ధ సెంటర్లను అలంకరించారు. సరిగ్గా ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణ పిదప వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ఎజెండా మేరకు ప్లీనరీని కొనసాగిస్తారు.
ఆకర్షణీయంగా వేదిక..
ఓ సిటీలో వేదిక అత్యంత ఆకర్షణీయంగా ఉండే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఉద్యమ స్ఫూర్తితో ఉండే విధంగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. ఎజెండా మేరకు అంశాలను ప్రస్తావించేందుకు ముఖ్యుల నిర్ధారణ పూర్తయ్యింది. అలాగే ఆయా అంశాలపై ముఖ్య ప్రసంగం చేసే వ్యక్తులను కూడా గుర్తించారు. భాజా భజంత్రీలు, ఊరేగింపులు, బోనాలు, బతుకమ్మల ప్రదర్శన, డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకునే విధంగా క్షేత్ర స్థాయిలో దింపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతినిధులకు అన్ని వసతులను సమకూరుస్తున్నారు. స్నాక్స్, వివిధ రకాల రుచికరమైన వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడా కూడా ప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా వలంటీర్లను పెద్ద సంఖ్యలో రంగంలో దించనున్నారు. ప్రతినిధులకు ఏ అవసరం వచ్చినా వెంటనే సమకూర్చే విధంగా వలంటీర్లు సహాయపడతారు. ధూంధాంలతో ఒక ఊపు, ఊరేగింపులతో ఒక జోష్, బతుకమ్మలు, బోనా లతో సంప్రదాయ వాతావరణం కలగలిసి ఆ ప్రాంతమంతా సమధికోత్సాహం నెలకొననుంది.
ఎమ్మెల్యే కీలకోపన్యాసం
అసెంబ్లీ ఎన్నికల ముంగిట జరగనున్న ప్లీనరీ వేదికపై ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంఖారావం పూరించనున్నారు. వివిధ అం శాలపై వక్తలు ప్రసంగించడం, ప్రతిపాదనలు, తీర్మానాలను ప్లీనరీ ఆమోదించడం, ఈ క్రమంలోనే కీలకోపన్యాసం చేయడం ద్వారా ఎమ్మెల్యే నరేందర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
Prev Post