ఐకెపి వివోఏ ఉద్యోగుల సమ్మెకు బిఎస్పి సంపూర్ణ మద్దతు

ఐకెపి వివోఏ ఉద్యోగుల సమ్మెకు బిఎస్పి సంపూర్ణ మద్దతు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

రాష్ట్రవ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న ఐకెపి వివోఏ ఉద్యోగుల సమ్మెకు బీఎస్పీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంవి గుణ తెలిపారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం ఎదుట గల వివోఏ ల దీక్ష శిబిరాన్ని సందర్శించి, వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివోఏ లకు కనీస వేతనం 26 రూపాయలకు పెంచి, వారికి పిఆర్సి అమలు చేస్తూ, వేతనాన్ని నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని, వారికి ఆరోగ్య భద్రత, పిఎఫ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కరోనతో మరణించిన వివోఏ ల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, అత్యంత దుర్మార్గమైన జీవో నెంబర్ 58ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జోనల్ మహిళా కన్వీనర్ మద్దెల భవానీ, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, నాయకులు సిద్దు, వివోఏ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking