మద్దూరులో జోరుగా వడగండ్ల వర్షం వరి మామిడి పంటలు ధ్వంసం రైతన్నలకు అపార నష్టం

మద్దూరులో జోరుగా వడగండ్ల వర్షం

వరి మామిడి పంటలు ధ్వంసం

రైతన్నలకు అపార నష్టం

మద్దూరు అక్షిత న్యూస్:

మద్దూరు మండలంలోని మద్దూరు, లాధ్నుర్, రెబర్థి, గాగిల్లపూర్,వంగపల్లి,వల్లంపట్ల గ్రామాలతో పాటు అనేక గ్రామాల్లో సాయంత్రం జోరుగా వడగండ్ల వర్షం కురియడంతో వేల ఎకరాల్లో వరి మామిడి పంటలు ధ్వంసం అయ్యాయి. అప్పులు చేసి వరీ, మామిడి పంటలు వేస్తే చేతికి అందే సమయంలో వడగండ్ల రూపంలో అకాల వర్షాలు కురిసి రైతన్నల నోట్లో మట్టి కొట్టి నోటికాడి అన్నాన్ని మట్టి పాలు చేయడంతో రైతులు బోరున విలపిస్తున్నారు.తక్షణమే ప్రభుత్వం అదుకోనీ అర్ధిక సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking