ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పుస్తక దినోత్సవం
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కళాశాలలోని ఆంగ్ల విభాగం ఆద్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవం మరియు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియం షేక్‌స్పియర్ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ ఆంగ్ల భాషా దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.లక్ష్మినరసింహం మాట్లాడుతు పుస్తకం ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుందని కాబట్టి విద్యార్థులు విద్యార్థి దశనుండే పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.కళాశాల ఆంగ్ల అధ్యాపకులు జె.ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆంగ్ల భాషా దినోత్సవం గురించి మరియు ఆంగ్ల భాషా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.అనంతరం పలువురు విద్యార్థులు సైతం ఆంగ్ల భాష గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.సి.హెచ్ రాజు,అధ్యాపకులు ఎం.రాజేశ్వర్, డా.టేమాజి,శరత్ చంద్ర,మహేశ్,సుస్మిత,కవిత పాల్గొన్నారు.