ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ సాంబార్లో అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం టెమ్రియన్ మోవడ్ గ్రామస్తులు గత ఏండ్లుగా తాము ఇదే గ్రామంలో నివసిస్తున్నామని, మాతోపాటు బండ గూడ, టోకి గూడ గ్రామాలకు బోరింగ్, మిషన్ భగీరథ పథకాన్ని అందించి నీటిని సరఫరా చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామానికి చెందిన పొడుపుగంటి కేతాన, పొడుపుగంటి అమృత, సిర్పూర్ (టి) మండలం కేశవపట్నం, భూపాలపట్నం కు చెందిన గోమస గీత తాము కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నామని, మాకు నివాస స్థలం ఉందని ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ వేరువేరుగా అర్జీ సమర్పించారు. పెంచికల్పేట్ జైహింద్ పూర్ గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ గ్రామంలో అటవీ హక్కు పత్రం కలిగిన భూములలో గిరి వికాస్ పథకం ద్వారా బోర్ వెల్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. లింగాపూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ నిమ్న నాయక్ తండాకు చెందిన రాథోడ్ భబితా బాయ్ తమ భూమిలో బోర్ వెల్ తో పాటు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకొని ఉన్నామని, విద్యుత్ సరఫరాకు గాను ఒక విద్యుత్ స్తంభం అవసరం ఉన్నందున మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెజ్జూరు మండలం జై హిందూపూర్ గ్రామానికి చెందిన రైతులు తమ భూములు కొత్తచెరువు లో ముంపుకు గురయ్యాయని, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking