తూర్పుగూడేం గానుగుబండ గ్రామాలలో ఘనం గా అంగన్వాడీలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం

తూర్పుగూడేం గానుగుబండ గ్రామాలలో ఘనం గా
అంగన్వాడీలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం

తుంగతుర్తి అక్షిత:
తుంగతుర్తి మండల పరిధిలోని తూర్పుగూడేం గానుగుబండ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం విద్యలో భాగంగా క్రమాభివృద్ధి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో మూడు సంవత్సరాల వయసు నుండి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రాథమిక పాఠశాల చదువుకు సంసిద్ధం అయి వెళ్తున్న సందర్భంగా పిల్లలు ఇప్పటివరకు నేర్చుకున్న చదువుతో పాటు ఆటలు, పాటలు, కథల పరంగా వారి ప్రతిభను గుర్తించి వారిని స్టార్స్ గా ఎంపిక చేసి వారికి ప్రగతి పత్రాలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రాథమిక పాఠశాల ప ఉపాధ్యాయులు శోభ జ్యోతి అంజలి మణెమ్మ ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking