అమిత్ షా… వైషమ్య రాజకీయాలు, ముస్లిం రిజర్వేషన్ రద్దు కవ్వింపు ప్రసంగాలు చెల్లవు *డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్
అమిత్ షా… వైషమ్య రాజకీయాలు, ముస్లిం రిజర్వేషన్ రద్దు కవ్వింపు ప్రసంగాలు చెల్లవు
*డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
భారతదేశంలో రిజర్వేషన్ ల వ్యవస్థ రాజ్యాంగ ప్రకారం నడుస్తుంది, ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తుంది మత ప్రాతిపదికన కాదు, ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్యా పరమైన వెనుకబాటుపై ఎన్నో కమిటీ లు అధ్యయనం చేసి ఎన్నో నివేదికలు సమర్పించాయని అని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.రవినాయక్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య కమిటీ లు రంగనాథ్ మిశ్రా కమిషన్, జస్టిస్ సచార్ కమిటీ, అమితాబ్ కుండు కమిటీ, సుస్పష్టంగా ముస్లింల స్థితి గతులు ఎస్సి, ఎస్టిల కన్నా ఎంతో దయనీయంగా, వెనుకబడి ఉన్నాయని చెప్పాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన రిజర్వేషన్ల పై అమిత్ షా వ్యాఖ్యలు తన పార్టీ తన ముస్లిం వ్యతీరేక వైఖరికి అద్దం పడుతున్నదన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 5 శాతం రిజర్వేషన్లు అప్పటి కాంగ్రెస్ సీఎం రాజశేఖర్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారు. అప్పుడు కూడా కాషాయ రాజకీయ పార్టీల, సంఘాల నా నా రభస చేశారు. రాజ్యాంగం ప్రకారం 5% ను 4% శాతంకు కుదించాన్నారు. ఇప్పటికీ సుప్రీం కోర్టు అధీనంలోనే కేసు నడుస్తుందన్నారు. రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పకుండా, మళ్ళీ హిందూ ముస్లిం, ఓవైసీ, రిజర్వేషన్ పై మాట్లాడటం కేంద్ర వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసం ఆడుతున్న మత రాజకియాల ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమ్తంగా ఉండాలని కపట రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని అడ్వకేట్ సాదిక్ షేక్ అన్నారు.
కర్ణాటకలో కూడా ఇలానే ముస్లిం రిజర్వేన్లపై డ్రామా చేస్తే కోర్టు స్టేను మరిచారా అని గుర్తు చేశారు.
రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని మాట్లాడే వారికి రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి ఎంత చెప్పినా దున్నోపోతుపై వర్షం పడ్డట్టే అని చమత్కరించారు.
ప్రజాస్వామ్య శక్తులు, రాజ్యాంగ విలువలకు పోరాడే వారందరూ ఏకమై మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, రాష్ట్ర నాయకులు పతాని శీను జిల్లా ఉపాధ్యక్షులు బాబు నాయక్ జిల్లా నాయకులు కూడా నాగేంద్రప్రసాద్, పల్లా బిక్షం పిలుపునిచ్చారు.