అమరుల ఆశయాల మేరకు సమస్యలపై పోరాడి సాధించాలి
*రాంరడ్డివర్ధంతి సభలో నేతలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
అమరుల ఆశయాల మేరకు సమస్యలపై పోరాడి సాధించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో వేముల రాంరెడ్డి ప్రధమ వర్ధంతి నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపించే వారన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. హౌసింగ్ బోర్డ్, విద్యానగర్ ప్రాంతంలో పేదల పక్షాన ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. కౌన్సిలర్గా అనేక సేవలు అందించాలని ఆయన మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరనిలోటన్నారు. ఆయన చూపిన మార్గాన్ని ఎంచుకొని ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడవత్ రవినాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, శశిధర్రెడ్డి, గాదె పద్మ, సత్యనారాయణరావు, చెనగని యాదగిరి, దేశిరం నాయక్, కోటిరెడ్డి, రాంచంద్రు, మల్లయ్య, రాములు, అఫాన్ అలీ, మాధవరెడ్డి, పల్లా బిక్షం, వెంకటయ్య పాల్గొన్నారు.
Next Post