రజక వృత్తిదారుల అభివృద్ధి కావాలి
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
అక్కేనపల్లి గ్రామం లో నేడు రజక సమావేశం జరిగింది..గ్రామంలో నూతనంగా ఏర్పడిన చాకలి అయిలమ్మ రజక సంఘ సర్వసభ్య తొలి సమావేశం అక్కేనపల్లి సత్తయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది…. ఈ సమావేశం లో రజక వృత్తిదారుల అభివృద్ధి కోసం చేయవల్సిన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది . సమావేశం లో గౌరవ అతిధి హోదాలో బెక్కంటి గణేష్ బీఎస్పీ మండల ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రజకుల అభివృద్ధి కి బీఎస్పీ పార్టీ నుండి సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొనడం జరిగింది. రజకులకు జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే ఏకైక పార్టీ బిఎస్పీ అని చెప్పారు. రజక సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గ్రామం లో రజక వృత్తిదారుల సంఘం ఏర్పాటు చేయాలని తెలిచేసారు ….ఈ సమావేశం లో ఉపాధ్యక్షుడు సత్యనారాయణ , జనరల్ సెక్రెటరీ శ్రావణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ యాదయ్య , సెక్రెటరీ నరసింహ , ముఖ్య సలహా దారులు భద్రయ్య ధనుంజయ , సభ్యులు రాములు కిష్టయ్య బిక్షమయ్య , సత్తయ్య గణేష్ సునీల్ అరుణ్ అంజి తదితరులు పాల్గొన్నారు.