అజేయ శక్తి ‘బీఆర్ఎస్ ‘

అజేయ శక్తి ‘బీఆర్ఎస్ ‘
* మరో ప్రస్థానానికి నాంది పలికిన కేసీఆర్
* మిర్యాలగూడ నియోజకవర్గంలో ఘనంగా ప్రతినిధుల సభ, వాడవాడనా గులాబీ జెండాల ఆవిష్కరణలు
* వందేండ్ల పాటు చెక్కు చెదరని సంస్థాగత నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత
* జలదృశ్యంలో మొదలై జన దృశ్యమై ఢిల్లీని వణికించిన చరిత్ర
* తొమ్మిదేండ్లలో అబ్బురపరిచే ప్రగతి
* ప్రత్యేక రాష్ట్ర సాధకుడే…రాష్ట్ర స్వాప్నికుడై సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్
* అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళి
* సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు
* ఊరూరా రెపరెపలాడిన గులాబీ జెండాలు
* ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పలు కీలక తీర్మాణాలను ముక్తకంఠంతో ఆమోదించిన గులాబీ శ్రేణులు
* దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌గా రూపాంతరం
* తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన గులాబీ జెండా 

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

భారత రాష్ట్ర సమితి తిరుగులేని రాజకీయ అజేయ శక్తిగా మారిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ నియోజకవర్గంలోని శ్రీమన్నారాయణ పంక్షన్ హాల్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. 2001లో జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ జనదృశ్యమై ఢిల్లీని వణికించిందన్నారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం గల్లీల్లో మొదలైన కొట్లాట ఢిల్లీని ఉప్పెనలా తాకిందన్నారు. 22 ఏండ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా మారడంతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదని అన్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిందన్నారు. 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రథసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారని అన్నారు. బీఆర్ఎస్ జెండా ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించి చైతన్యపరచాలని పార్టీ శ్రేణులను వారు కోరారు. పార్టీ కోసం క్రమశిక్షణతో కష్టపడి నిబద్ధతతో పనిచేసే వారికి నూతన గ్రామ, మండల, పట్టణ కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ‘రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి’ అని కార్యకర్తల్లో స్ఫూర్తి నింపిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం బహుముఖాభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్లలో అబ్బురపరిచే ప్రగతిని సాధించామని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, స్వాప్నికుడైన కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. రాష్ట్ర సాధనలో వెలకట్టలేని అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తొమ్మిదేండ్లలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. దేశానికే బువ్వ పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా బీడు భూములన్నీ సశ్యశ్యామలం అవుతున్నాయని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడ్డాయని అన్నారు. అప్పుల బాధతో రైతుల బలవన్మరణాలు పూర్తిగా నిలిచిపోయాయని, అన్నదాతలు కాలర్ ఎగురవేస్తూ దర్జాగా జీవిస్తున్నారని చెప్పారు. దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ చరిత్ర ఫుఠల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ గా మారారని అన్నారు.
రాష్ట్రంలో విద్యా రంగం బలోపేతమైందని అన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. 14ఏండ్ల మలిదశ ఉద్యమకాలంలో రాష్ట్రంలోని అన్ని ఊళ్ళు తిరుగుతూ ప్రజల స్థితిగతులను కేసీఆర్ తెలుసుకున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ సాధన క్రమంలో ఎదురవుతున్న అనేక సవాళ్ళను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సీఎం కేసీఆర్ అవిరామ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అనేక గ్రామాలు క్షామం నుంచి సంక్షేమ బాట పట్టాయని అన్నారు. తెలంగాణలో శిథిల దశకు చేరుకున్న గ్రామాలన్నీ ప్రగతి పథాన పయనిస్తున్నాయని అన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం పల్లె ప్రగతి, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తున్నదని అన్నారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు అనేక కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందజేస్తోందన్నారు. ఆర్ధిక స్థోమతలేనివారికి కూడా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చెక్కులు అందజేస్తూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అర్హులకు పెన్షన్ అందజేస్తూ ప్రభుత్వం ఆదుకుంటున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం ఉపకరవేతనాలు అందజేస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా 45వేల చెరువులను పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు. అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళి అర్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ వ్యవస్థ ఆర్ధికంగా పరిపుష్టంలో ప్రభుత్వం సఫలమైందన్నారు.2001, మే17న కరీమ్ నగర్ సింహగర్జన సభలో టీఆర్ఎస్ ను రాజకీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్ నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు. నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభకు విచ్చేసిన గులాబీ దండుకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ రూపాంతరం చెందిందని, మారింది టీఆర్‌ఎస్‌ పేరు మాత్రమేనని.. జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్‌ నమ్మారని తెలిపారు. అర్ధబలం, అంగబలం లేకున్నా తెలంగాణ కోసం బయలుదేరారని తెలిపారు. అంతకు ముందు నేతలు తెలంగాణ ఉద్యమం పేరుతో మోసం చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేదని చెప్పారు. అయితే ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ అని వెల్లడించారు. 2013లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్తున్నాను.. తెలంగాణలోనే అడుగుపెడతానని కేసీఆర్‌ చెప్పారని, అన్నట్టుగానే తెలంగాణ సాధించి తిరిగి వచ్చారని వెల్లడించారు. లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్‌ జన్మదన్యమైందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొనియాడారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఎట్లున్న తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మన కండ్లముందే ఉందన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. దేశ జనాభాలో 3 శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందన్నారు. మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ మూడు సభలు పెడితే లక్షల మంది వచ్చారని తెలిపారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అంటూ నినదించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో వ్యవసాయ రంగానికి రూ.4.5 లక్షల కోట్లు ఖర్చుపెట్టిందన్నారు. రైతులకు ఇంత పెద్దమొత్తంలో ఖర్చుచేసిన ప్రభుత్వం ఏదీ లేదని స్పష్టం చేశారు. ఇవాళ ఊరూరా కార్యకర్తలు గులాబీ జెండాలు ఎగరేస్తుంటే గుండె ఉప్పొంగి పోతున్నదని గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు గులాబీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ప్రజాప్రతినిధుల సభలో ప్రజాప్రతినిధులు ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను గులాబీ శ్రేణులు ముక్తకంఠంతో ఆమోదించాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీర్మానాల అనంతరం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జునా చారి, యూసుఫ్, పట్టణ కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు మధార్ బాబా, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, ఇమ్రాన్, వెంకట్, ఆయా గ్రామాల సర్పంచ్లు,ఉప సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు అధ్యక్షులు, ఇంఛార్జీలు, పట్టణ కౌన్సిలర్లు, వార్డు ఇంఛార్జీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking