క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

రూ.1.12కోట్ల విలువైన
సొమ్ము స్వాధీనం

జిల్లా ఎస్పి అపూర్వ రావు

అక్షిత వార్తకు స్పందన

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 9మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పి కె.అపూర్వరావు తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసుస్టేషన్ పరిధి మయూరినగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ఫ్లాట్ నంబర్303 సాయిదత్త అపార్ట్ మెంట్ లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఇన్స్ పెక్టర్ రాఘవేందర్, టాస్క్ ఫోర్స ఎస్ఐ శివ, స్పెషల్ టీం ఎస్ఐ కట్టంగూర్ విజయ్ కుమార్, మిర్యాలగూడ టూటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, పిసి కొమ్ము రవి, రెహ్మాన్ లు దాడి జరిపి ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 నిందితులను అరెస్టు చేసి వారి నుండి 1 కోటి 12 లక్షల రూపాయల నగదు, రెండు కార్లు (30 లక్షల విలువ ) ,14 సెల్ ఫోన్స్ (3 లక్షలు విలువ, మొత్తం1 కోటి 45 లక్షల రూపాయల విలువ గలిగినవి స్వాదీనం చేసుకున్నారన్నారు.

నిందితులు మిర్యాలగూడ పట్టణంకు చెందిన బంటు రాజేష్, ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంకు చెందిన కోల‌సాయికుమార్, బోనకల్ కు చెందిన రాచబంతి జీవన్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా రాహేంద్రవరంకు చెందిన నోట్ల సత్యనారాయణ, ఖమ్మం చెందిన శాఖమూరి ఉదయ్ కుమార్, మిర్యాలగూడ బంటు సంతోష్, గంధం నవీన్ కుమార్, బంటు వంశీకష్ణ، కుమ్మక్కు చెందిన కొండేటి రాజేష్ లను అరెస్టు చేసి స్థానిక జుడి‌షియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చామన్నారు. చట్టవ్యేతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఏ1నిందితుడు బంటు రాజేష్ కుమార్ 3సంవత్సరాలుగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని, ఇతను టెలిగ్రాం యాప్ ద్వారా హార్ధీక్ బుక్కి ప్యానల్ నుండి మెయిన్ లైన్ యాక్సెస్ ని తీసుకున్నొడన్నారు‌. ఈ లింకును అతని బావమరిది కోలా సాయికుమార్ కు ఫార్వర్డ్ చేసి నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుని ఆన్ లైన్, ఆప్ లైన్ లో బెట్టింగ్ ఆడుతూ పట్టుబడ్డారు. వీరిపై సెక్షన్3&4 గేమింగ్ యాక్టు కింద నమోదు చేశామన్నారు.
కేసును చాకచక్యంగా డియస్పీ వెంకటగిరి పర్యవేక్షణలో మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, ఎస్ఐ శివతేజ, ఎస్ఐ కట్టంగూర్ విజయ్ కుమార్, మిర్యాలగూడ 2 టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ గఫార్, కానిస్టేబుల్స్ కొమ్ము రవి హాలియా పియస్ రహిమాన్, జి.హుస్సేన్, బి.వీరబాబు, ఎస్.వెంకటేశ్వర్లు, ఎం. సైదులును జిల్లా ఎస్పి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking