ప్రజా చైతన్యమే సీపీఐ పాదయాత్ర లక్ష్యం

ప్రజా చైతన్యమే సీపీఐ
పాదయాత్ర లక్ష్యం

బిజెపిని గద్దెదించేందుకు
ఇంటింటికి కరపత్రాల పంపిణీ

సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్

మేడ్చల్, అక్షిత బ్యూరో :
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా కుత్బుల్లాపూర్ సీపీఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి సీపీఐ అనే నినాదంతో పాదయాత్రలను సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్ శ్రీనివాస్ నగర్ లాస్ట్ బస్టాప్ నుండి ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో అమలు కానీ హామీలను ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ పేద ప్రజల నెత్తిపై ఆర్థిక భారం వేస్తుందని అన్నారు. రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోవడమే కాకుండా అన్ని వస్తువులపై కట్టే పన్నులు కూడా ఎక్కువయ్యాయిని అన్నారు.

ఎంత పన్నులు కాదుటున్నామో అంత సహాయం కూడా ప్రభుత్వం నుండి రవట్లేదని విమర్శించారు. బీజేపీ మోడీ పేద ప్రజలు కట్టే పన్నునేమో పెంచి పెట్టుబడిదారుల పన్నులను తగ్గించిందని ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను తొలగిస్తూ పారిశ్రామికవేత్తలకు మాత్రం తీసుకున్న లోన్లను మాపి చేస్తుందని ఇలా అన్ని విషయాల్లో బీజేపీ కేవలం ఉన్న వారికే ఉపయోగ పడుతూ పేద వారికి నష్టం చేకూరుస్తుందని ఇలాంటి విషయాల పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర సమితి సభ్యులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, మండల కార్యదర్శులు శ్రీనివాస్, పర్వీనా, సహాయ కార్యదర్శులు దుర్గయ్య, రాము,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు భాస్కర్,సీపీఐ నాయకులు కృష్ణ,సదానంద్ రాములు, సాయిలు,శేఖర్, సహదేవ్,ఆరిఫ్,యూసుఫ్,రాజు,వెంకటేష్,శ్రీకాంత్,అశోకరెడ్డి, డేనియల్,శివ,యాదగిరి, చారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలను శ్రీనివాస్ నగర్ నుండి ప్రారంభమై మక్ధూమ్ నగర్ వరకు పాదయాత్ర చేరుకోవడం జరిగిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking