ప్రతిభతోనే ఉజ్వల భవిష్యత్తు
జేఎన్టీయూ వీసీ కట్ట నర్సింహారెడ్డి అన్నారు.
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించే టెక్ ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వీసీ కట్ట నరసింహారెడ్డి మాట్లాడుతూ టెక్నాలజికల్ రంగంలో ప్రతి ఒక్కరు ప్రతిభ కనబరిచే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు.జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలోని ఏడు విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ టెక్ ఫస్ట్ లో పాల్గొననున్నారని వెల్లడించారు.ఈ టెక్ ఫస్ట్ లో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.