పేదల ఆత్మ గౌరవ ప్రతీక… డబుల్ ఇళ్లు

పేదల ఆత్మ గౌరవ ప్రతీక…
డబుల్ ఇళ్లు

డీజే సప్పులు, బైక్ ర్యాలీలతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ బేతవోలు గులాబీ దళం

బేతవోలు శ్రీ సీతారామచంద్ర స్వామి పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారం

60 మంది లబ్ధిదారులకు
డబుల్ ఇళ్లు పంపిణి

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ టౌన్, అక్షిత న్యూస్ :

పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకురావడం జరిగిందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో 3 కోట్ల 2 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ . దేవాలయ పాలకమండలి చైర్మన్ ఎగ్గడి శీను, పాలకవర్గ సభ్యులు అద్దోజు శ్రీనివాస్, మైసమ్మ రామస్వామి, కోటిరెడ్డి, రాంబాబు, అచ్చయ్య, నాగేంద్రబాబు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని లక్ష్యంతో నిర్మించారని ఆయన అన్నారు.పేదలు ఆత్మ‌గౌర‌వంతో జీవించడానికి మ‌న డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు అని ఆయన తెలిపారు.అభివృద్ధి-ప్ర‌జా సంక్షేమం ప్ర‌భుత్వానికి రెండు కండ్లు అని ఆయన అన్నారు.గ‌త ప్ర‌భుత్వాలు, ఇరుకు గ‌దులు, ఇబ్బందుల‌తో కూడిన నిధులు, అతి త‌క్కువ వ్య‌యంతో అర‌కొర వ‌స‌తుల‌తో ఇచ్చిన ఇండ్లు కాకుండా, సిఎం కెసిఆర్ తెలంగాణ‌లోని నిరుపేద‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ఉండే విధంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నార‌ని ఆయన తెలిపారు. ప్ర‌భుత్వ‌మే సొంతంగా నిర్మించి, ల‌బ్ధిదారుల‌కు అప్ప‌గిస్తున్న‌ద‌ని ఆయన అన్నారు. ఇలా ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌డం లేద‌ని ఆయన తెలిపారు. ప్ర‌భుత్వం నిరుపేద‌ల ప‌క్ష‌పాతిగా పని చేస్తుంది అని ఆయన అన్నారు. అభివృద్ధి-సంక్షేమాలే రెండు కండ్లుగా కెసిఆర్ పాల‌న సాగిస్తున్నారని అన్నారు.పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం అమలు చేయడం జరుగుతుంది అని ఆయన గుర్తు చేశారు.నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ దక్కలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన అన్నారు.త్వరలో సొంత స్థలం ఉన్న పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఎంపికలో పారదర్శక పాటిస్తూ ఎంపిక చేసామని ఆయన తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా చూస్తామని ఆయన అన్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. కొంతమందికి ఇండ్లు కట్టలేదు బిల్లులు ఎత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇల్లను పంపిణీ చేసిందని తెలిపారు. పేదలందరూ ఆత్మగౌరవంతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఎంతో సహాయతమైన నిర్ణయంతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, బిఆర్ఎస్ ప్రభుత్వానికి నిండు ఆశీర్వాదం అందించాలని కోరారు. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కొండ సైదయ్య , తాసిల్దార్ రాజేశ్వరి, మాజీ ఎంపీపీ బజ్జూరు వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్లు జనార్ధన్, సైదులు, వైస్ చైర్మన్ జానకి రామాచారి, మాజీ సర్పంచ్ తాళ్లూరి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి భట్టు శివాజీ నాయక్, కొవ్వూరు వెంకటేశ్వర్లు, గన్న అశోక్, నాయకులు యాగ్గడి రామారావు, తాళ్లూరి ప్రసాద్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking