యువ సమ్మేళనం విజయవంతం చేయాలి

*యువ సమ్మేళనం విజయవంతం చేయాలి

చీరాల రమేష్

రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల కేంద్రంలో యువజన విభాగం అధ్యక్షులు వనపర్తి బద్రీనాథ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి గంట విజయ్ అధ్యక్షతన గురువారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంచాల మండల పార్టీ అధ్యక్షులు చీరాల రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరుపుల చంద్రయ్య హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచాల మండలం కేంద్రంలోని యువత విద్యార్థి విభాగాలను ప్రతిష్ట చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, కొత్త యువతరానికి పార్టీలోకి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందించి, వచ్చేనెల 9 తేదీ జరిగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువ సమ్మేళన కార్యక్రమానికి మంచాల మండలం నుంచి పెద్ద ఎత్తున యువతని, విద్యార్థులని తరలించవలసిందిగా వారు యువతను కోరడం జరిగింది. ప్రతి గ్రామాలలో పార్టీని ప్రతిష్ట చేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న పార్టీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని వారు యువత విద్యార్థి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు నూతన గంటి శేఖర్ ,ఇబ్రహీంపట్నం కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ జానీ పాషా, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఆంబో ప్రవీణ్ నాయక్ ,సీనియర్ నాయకులు ఇటుకల ప్రకాష్ రెడ్డి, యువజన విభాగం ఉపాధ్యక్షులు బస్సు ప్రవీణ్ రెడ్డి ,పి యాదగిరి గౌడ్, కంకని విజయ్ ,పొలమోని శ్రీకాంత్ ,నియోజకవర్గ టిఆర్ఎస్వి కోశాధికారి కొత్తపల్లి సాయికుమార్, నియోజకవర్గ నాయకులు నాగరాజు ,విష్ణు ప్రశాంత్ చెన్నకేశవ సుకరి ,నిఖిల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking