దేశంలో రైతు రాజ్యం

రైతులకు మనమే భరోసా

ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతిననీయం
దళితబంధులో అవినీతి తేలితే చర్యలు
 ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సరార్‌’

బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభలో కేసీఆర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి:

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశంలో రైతు రాజ్యం సాధిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ సాధించిన స్ఫూర్తితో ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సరార్‌’ నినాదంతో దేశాన్ని ప్ర గతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం’ అని తెలిపారు.గురువారం బీఆర్‌ఎస్‌ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రతినిధుల సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశంలో రైతు రాజ్యం సాధిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ సాధించిన స్ఫూర్తితో ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సరార్‌’ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం’ అని తెలిపారు. గురువారం బీఆర్‌ఎస్‌ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రతినిధుల సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా వ్యవసాయాన్ని ఆదుకుంటాం. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందచేస్తాం. రైతుల ఆత్మసె్థైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకుండా చూస్తాం. అని స్పష్టంచేశారు.

దళితబంధులో అవినీతి తేలితే టికెట్‌ కట్‌
దళితబంధు అమలులో అవినీతి తేలితే వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇచ్చే ప్రసక్తే ఉండదని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఈ పథకంలో అవినీతికి ఎంతమాత్రం ఆస్కారం ఉండకూడదని ప్రజాప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘నేను ఆత్మ పెట్టుకొని దళితబంధు పథకాన్ని రూపొందించిన. అహోరాత్రులు ఆలోచిస్తే దళితబంధు పుట్టింది. ఇంత మంచి పథకం అమలులో ఎక్కడా అవినీతి ఆస్కారాలకు తావు ఉండకూడదు. ఇందులో ఎమ్మెల్యేలే కాదు.. కిందోడు తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మసలుకోవాలి’ ఆయన హెచ్చరించారు.

ప్రజలు సంతోషంగా ఉన్నారు: సండ్ర
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి లబ్ధిదారుల ఇండ్లవద్దకే వెళ్లి అభిప్రాయాలు తెలుసుకొంటున్నామని ఎమ్మెల్యే సం డ్ర వెంకట వీరయ్య చెప్పారు. ప్రజలు చాలా సంతోషంగా స్పందిస్తున్నారని తెలిపారు.

దేశానికి కేసీఆర్‌ ఆదర్శం: గువ్వల
దళితబంధు తెచ్చి, సచివాలయానికి అంబేదర్‌ పేరు పెట్టిన మహానాయకుడు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీర్తించారు. సీఎం నిర్ణయాలు దేశానికే ఆదర్శమన్నారు.

సంపద ప్రజలకే : ఎమ్మెల్సీ సిరికొండ
దళితబంధు ఒక విప్లవం, ఒక సంసరణ అని ఎమ్మెల్సీ సిరికికొండ మధుసూదనాచారి అన్నారు. తరతరాలుగా సంపద సృష్టిలో ముందున్నా.. ఇప్పటివరకు ఆ సంపద పంపిణీ జరగలేదని గ్రహించిన సీఎం కేసీఆర్‌, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతూ చరిత్రలో దార్శనికుడిగా నిలిచిపోతున్నారని కొనియాడారు.

దేశం రుణపడి ఉంటది: బాల్క సుమన్‌
సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నపుడే దళిత చైతన్య జ్యోతి కార్యక్రమంతో దళితుల అభివృద్ధి కోసం తపన పడ్డ దార్శనికుడు సీఎం కేసీఆర్‌ అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ కొనియాడారు. కేసీఆర్‌ చేస్తున్న కృషికి భవిష్యత్తులో యావత్‌ భారతదేశం రుణపడి ఉంటుందని చెప్పారు.

అబ్‌ కీ బార్‌ కేసీఆర్‌ సర్కార్‌: తోట
కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారని ఏపీ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. కేంద్రంలో ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సరార్‌ మాత్రమే కాదు.. అబ్‌ కీ బార్‌ కేసీఆర్‌ సరార్‌’ అని ఆయన ఆకాంక్షించారు.

అవసరమైతే పార్టీ టీవీ ఛానల్‌
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్‌ పెంచుకోవడం ప్రజాప్రతినిధులు కీలకమైన అంశంగా భావించాలని కేసీఆర్‌ సూచించారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ను భవిష్యత్తులో చేపట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఇంకా అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా తెస్తామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking