మచ్చలేని మార్క్సిస్టు మాలి

మచ్చలేని మార్క్సిస్టు మాలి

రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగన్న,
జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి
సుధాకర్ రెడ్డి,

అక్షిత ప్రతినిధి, వేములపల్లి : మచ్చలేని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు అమరజీవి సీపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు మాలి పురుషోత్తం రెడ్డి అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలు అన్నారు.

శనివారం వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామంలో సీపిఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి అధ్యక్షత వహించగా నిర్వహించిన సీపిఎం జిల్లాకమిటీ సభ్యులు మాజీ జెడ్పిటిసి సభ్యులు మాలి పురుషోత్తం రెడ్డి ద్వితీయ వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని తోపుచర్ల ఫిర్కాలో కమ్యూనిస్టు పార్టీ ని బలోపేతంచేసి కమ్యూనిస్టు కంచుకోటలాగా మార్చిన మచ్చలేని మహా జననేత మాలి పురుషోత్తం రెడ్డి అన్నారు. నేటి కమ్యూనిస్టు పార్టీమార్కిస్టు నాయకులు మాలి పురుషోత్తం రెడ్డి పోరాట స్పూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజాపోరాటాలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వేములపల్లి మండలంలో తనదైన ముద్ర వేసిన మాలి పురుషోత్తంరెడ్డి హయాంలో నిర్వహించిన ప్రజా పోరాటాలు జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్,మల్లు గౌతమ్ రెడ్డి, రేమిడాల పరశురాములు, రొండి శీను, రాగిరెడ్డి మంగారెడ్డి, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన,తోపాటు పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking