వడగండ్ల వానతో దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన

వడగండ్ల వానతో దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెంలో నిన్న రాత్రి ఈదురుగాలులు, వడగండ్ల వానతో దెబ్బతిన్న ఇళ్లను మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ అధికారులు నష్టం అంచనా త్వరితంగా సాధ్యమైనంత వరకు సహాయం చేయాలన్నారు. సుమారు 2లక్షల రూపాయలు మేర నష్టం జరిగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ అనిల్ కుమార్, గిరిద్వర్ సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ గజ్జల జయమ్మ కోటిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు వంగాల వెంకటరెడ్డి, అధిమళ్ల నాగేష్, మాజీ ఉపసర్పంచ్ ఎస్కె.సైదులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking