ఏరియా ఆసుపత్రి తనిఖీ

ఏరియా ఆసుపత్రి తనిఖీ

 వైద్యారోగ్యశాఖ కమీషనర్ రమేష్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కెవి రమేష్ శుక్రవారం సందర్శించారు. జిల్లాలోని అన్ని ప్రాంతీయ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి రోగులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. మిర్యాలగూడ ప్రాంతం ఆసుపత్రిలో 100 పడకలతో అదనంగా మరో భవనాన్ని నిర్మిస్తున్నామని, ఇందుకు సరిపడా వైద్యులు వైద్య సిబ్బందిని నియామకాలు జరుపుతామని తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరలో మంత్రి హరీష్ రావుచే ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు.

శిశువులకు ఐసీయూ ప్రత్యేకంగా నిర్మించామని ఇందులో 42 పడకలున్నాయని తెలిపారు. ఆయన వెంట డిసిహెచ్ఎస్ మాతృనాయక్. సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమరుద్, ఆర్ఎంఓ రాంబాబు, వైద్యులు జిగేందర్, రంగయ్య పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking