పల్లెకు ఘన సత్కారం

*ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పల్లె రవికుమార్ గౌడ కు ఘన సన్మానం.*

కోదాడ టౌన్, అక్షిత న్యూస్:

కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన గౌడ ఆత్మీయ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన పల్లె రవికుమార్ గౌడ్ హాజరయ్యారు. పల్లె రవికుమార్ గౌడ్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి కోదాడకు విచ్చేసిన సందర్భంగా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ఘనంగా సన్మానించారు. రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం జర్నలిస్టుల మిత్రులతో ఎంతో అనుబంధం ఉందని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలోని జర్నలిస్టును ఏకతాటిపై తీసుకురావడంతో క్రియాశీలక పాత్రను పోషించానన్నారు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నానని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మరికంటి లక్ష్మణ్, పూర్ణచంద్రరావు, సోమపంగు గణేశ్, కుడుముల సైదులు, నూకపంగు గోపాలకృష్ణ, షేక్ నజీర్, చింతలపాటి సురేష్, రాయల్ వెంకన్న, శ్రీహరి, బండి శీను, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking