నివాస స్థలం కొరకు దరఖాస్తుల స్వీకరణ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మూటపురం శంకరగిరి తండా రామచంద్రపురం నాచేపల్లి సదాశివపురం అప్పలనరసింహపురం గ్రామాలలో నివాస స్థలం లేని వారు నేడు మే 31 నుండి జూన్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించబడునని ధరఖాస్తుదారులు సంబంధిత గ్రామ పంచాయితీలలో సమర్పించాలని నేలకొండపల్లి తాహసీల్దార్ ధార ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తుతో పాటు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ జత చేయలన్నారు.