తాండూరు ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

తాండూరు ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

తాండూరు, అక్షిత ప్రతినిధి:

పూల చాదర్ సమర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన 4వ వార్డ్ కాంగ్రెస్ నాయకులు షేక్ వసీం ఇందిరానగర్. నేడు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్క రించుకుని అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4వ వార్డు షేక్ వసీం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో పూల చాదర్ సమర్పించి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయు రారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ప్రత్యేక దువాలు చేశారు. అనంతరం భక్తులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, మానవ సేవే మాధవ సేవ అనే భావనతో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని, ఆయన నాయకత్వంలో తాండూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రార్థించారు.ఈ సందర్భంగా షేక్ వసీం మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరెన్నో ఆరోగ్యంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking