ఈ నెల 10న ‘జైల్ భరో’ను జయప్రదం చేయండి

ఈ నెల 10న ‘జైల్ భరో’ను జయప్రదం చేయండి

– ఆశా వర్కర్స్ యూనియన్లకు (సీఐటీయూ ) పిలుపు

– వైద్యాధికారికి ఆశ వర్కర్లు వినతిపత్రం అందజేత

​లోకేశ్వరం, ఆగస్టు 4( అక్షిత న్యూస్ ):

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న ‘జైల్ భరో’ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపునిచ్చింది.ఈ మేరకు మంగళవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యాధికారికి ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్పొరేట్ యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ శ్రామికుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా వేతనాలు పెంచకపోగా, ఉన్న ఉద్యోగ భద్రతను తీసివేసేలా వ్యవహరించడం దారుణమన్నారు.29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేస్తూ, పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలి.ఉపాధి హామీ పథకంలో మార్చిన నూతన నిబంధనలను ఎత్తివేసి, వ్యవసాయ కార్మికులకు పని రక్షణ కల్పించాలి.ప్రజలపై భారం మోపే విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలి.రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. నూతన విద్యా విధానం పేరుతో విద్యా రంగాన్ని వ్యాపారమయం చేయడం ఆపాలి.ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నంద, గోదావరి, స్వప్న, మమత, కళ్యాణి, సాయమ్మ, సవిత, సుజాత, శారద, విజయ, గంగారాణి, సబిత, అర్చన, కమల తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking