సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త!

సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త!

– సైబర్ జాగృతి దివస్ పోస్టర్ ఆవిష్కరణ..

– లోకేశ్వరంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు..

– ఏఎస్పీ సాయికిరణ్

లోకేశ్వరం, ఆగస్టు 5 (అక్షిత న్యూస్):

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ప్రజలను ఆశ చూపించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే సైబర్ మోసగాళ్ల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బైంసా జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) సాయికిరణ్ ప్రజలకు సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలో బుధవారం ఏఎస్పీ సాయికిరణ్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సై ఎల్. ప్రదీప్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ జాగృతి దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏఎస్పీ సాయికిరణ్ మాట్లాడుతూ, సాంకేతికతను మంచి పనుల కోసం వినియోగించుకోవాలని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముధోల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సై ఎల్. ప్రదీప్, సర్పంచ్ ధర్వాడి కపిల్, మాజీ సర్పంచ్ మెండే శ్రీధర్, నాయకులు రాంచందర్, లక్ష్మణ్ రావు, విజయ్ రావు, రామారావు, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు, స్థానిక హాస్టల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking