గాంధారి బోనాల జాతరకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు

గాంధారి బోనాల జాతరకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

ఈ నెల 9న నిర్వహించనున్న గాంధారి బోనాల జాతరను పురస్కరించుకుని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లను పోలీసు అధికారులు గురువారం పరిశీలించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్, కాసిపేట ఎస్‌ఐ అంజనేయులు, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్ జాతర ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.నేషనల్ హైవేపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ హైవే అథారిటీ అధికారి సునీల్ ఆధ్వర్యంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించారు. జాతరకు వచ్చే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking