రామాలయం వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి ..

రామాలయం వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి ..

మేడ్చల్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేత..

కుత్బుల్లాపూర్,అక్షిత ప్రతినిధి :

సైబరాబాద్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ జూన్ దుండిగల్ సర్కిల్ బహదూర్‌పల్లి రామాలయం వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని మేడ్చల్ రూట్ బస్సులను ఆపాలని కోరుతూ ఈ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బహదూర్ పల్లి యువనాయకులు,మాట్లాడుతూ బహదూర్‌పల్లి రామాలయం ప్రాంతం 294 డివిజన్ కు ప్రధాన కేంద్రం. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు రోజూ ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బస్ స్టాప్ లో బస్ ఆపకపోవడం వలన ప్రజలు 1 కి.మీ నడిచి మెయిన్ రోడ్డు వరకు వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తోంది. దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మధ్యలో దిగడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారు.తక్షణమే బహదూర్‌పల్లి రామాలయం వద్ద అధికారిక బస్ స్టాప్ ఏర్పాటు చేసి, అన్ని బస్సులను ఇక్కడ ఆపేలా డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే బస్ స్టాప్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో బహదూర్ పల్లి స్థానికలు మైసిగారి మదన్ రావు, సగ్గిడి నర్సింగ్ రావు, నర్సింగం శ్రవణ్ కుమార్, నర్సింగం కిరణ్ కుమార్, వెంకటేశ్వర్ రావు, మరియు పల్లె ప్రతాప్ చిన్న పాల్గొన్నారు. ప్రజల డిమాండ్ మేరకు ఈ వినతి పత్రం అందజేశారు,15 రోజుల్లో స్పందన లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.యువ నాయకులు..

Leave A Reply

Your email address will not be published.

Breaking