ఐఎండబ్ల్యుఎఫ్ జాతీయ సంయుక్త కార్యదర్శిగా శృతిరావు

ఐఎండబ్ల్యుఎఫ్ జాతీయ
సంయుక్త కార్యదర్శిగా శృతిరావు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
క్రీడల్లో 8 పర్యాయాలు నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ గా అవార్డులందుకున్న ఎం శృతిరావు ఇండియన్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇప్పటికే తెలంగాణ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశిష్ఠ సేవలందిస్తుండ్రు. మే 27,28 తేదీల్లో హైదరాబాద్ లోని చిక్కడపల్లి ఇండియా పోస్ట్ కన్వెన్షన్ సెంటర్ లో నేషనల్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ 2023 పోటీలు నిర్వహించారు. 16 రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది వెయిట్ లిఫ్టర్స్ భాగస్వాములయ్యారు. రెండవ నేషనల్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు శృతి రావు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిశాయి. అనంతరం జరిగిన ఎన్నికల ప్రక్రియలో తెలంగాణ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న శృతి రావును ఇండియన్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా నియమించారు. దీంతో తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా శృతి రావు సేవలను వినియోగించుకోనున్నారు. అర్జున్ అవార్దు గ్రహీత భర్తీ సింగ్, శివాజీ అవార్డు గ్రహీత ఉదయ్ శెట్టి, 4 పర్యాయాలు ఒలింపియన్ అయిన ఆరీఫ్ మహమ్మద్ లుముఖ్య అతిధులుగా వ్యవహరించారు. ఈ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి కల్గిన కరణం కల్యాణి, రాజీవ్ శర్మ,జీ.నాగరాజు, సంతుక్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎం శృతి రావును ఇండియన్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక చేశారు. కాగా, శృతిరావు ఇండియన్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావడం పట్ల ఐజేయూ143 ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ అభినందించారు. మరింత సేవలందించి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

*పదవులకు వన్నె తెస్తా : శృతి రావు*

ఇండియన్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని తెలంగాణ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఇండియన్ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ ఎం శృతి రావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తనకు అప్పగించిన పదవులకు వన్నె తెస్తానని చెప్పారు. లాంగ్ జంప్ తో పాటు వివిధ క్రీడల్లో 8 సార్లు జాతీయ స్థాయి గోల్డ్ మెడల్స్ పొందానని, ఆయా క్రీడల్లో యువత మరింత మందిని రాణించేందుకు కృషి చేస్తానన్నారు. క్రీడా రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ తగిన ప్రాధాన్యతనిస్తున్నారని, ఆయా గ్రామాల్లోని యువతీ, యువకులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు క్రీడా ప్రాంగణములను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking