పరిశ్రమల కొరకు భూములు కోల్పోయిన వారికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలి
ఒక ఎకరా భూమి కోల్పోయిన వారికి 500 గజాల హెచ్ఎండిఏ ప్లాట్లు ఇవ్వాలి
బీఎస్పీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
రంగారెడ్డి అక్షిత బ్యూరో:
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గత పాలకులు స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, పరిశ్రమ నిమిత్తం భూములు కోల్పోయిన వారికి పరిశ్రమలలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి, భూములను తీసుకున్నారని, అట్టి భూములు కోల్పోయిన వారికి 70 శాతం మందికి పరిశ్రమలలో పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని, అలాగే ఒక ఎకరా భూమి కోల్పోయిన వారికి 500 గజాల హెచ్ఎండిఏ ప్లాట్లు ఇవ్వాలని సోమవారం రోజు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డిఓ కు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఎస్పి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిఎస్పి నాయకులు మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల ప్రత్యేక పారిశ్రామిక సంస్థ (సెజ్), లో, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టి సి ఎస్) లో హెలికాప్టర్ల, విమానాల విడిభాగాల తయారీ, ఇతర సంస్థలలో, ఇబ్రహీంపట్నంలోని బీడీఎల్, ఎన్ ఎస్ జి, ఆక్టోపస్, వైట్ గోల్డ్, క్లస్టర్ పార్క్, త్వరలో ప్రారంభమయ్యే బెల్ కంపెనీలలో భూములు కోల్పోయిన కుటుంబ సభ్యులకు 70 శాతం ఉద్యోగాలు ఇస్తామని ఆనాటి పాలకులు చెప్పారు అని అన్నారు. భూభాధ్యులకు 70% పర్మనెంట్ ఉద్యోగం కల్పించి, ఒక ఎకరానికి 500 గజాల హెచ్ఎంటి ప్లాట్లు ఇవ్వాలని, లేనిపక్షంలో బీఎస్పీ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గణేష్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి కొండ్రు రఘుపతి, మల్లెల అశోక్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ప్రెసిడెంట్ చెరుకూరి కరుణాకర్, చింతపట్ల నణేష్ తదితరులు పాల్గొన్నారు.