కడుపునొప్పి తాళలేక రైతు కూలీ ఆత్మహత్య…

కడుపునొప్పి తాళలేక రైతు కూలీ ఆత్మహత్య…

లోకేశ్వరం మండలం మన్మద్‌లో విషాదం

లోకేశ్వరం, ఆగస్టు 3 అక్షిత న్యూస్ : 

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గడిచిన ఆరు నెలలుగా కడుపునొప్పితో నరకం చూస్తున్న ఒక వ్యక్తి, ఆ బాధను తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో చోటుచేసుకుంది.లోకేశ్వరం ఎస్సై ఎల్. ప్రదీప్, తెలిపిన వివరాల ప్రకారం… మన్మధ్ గ్రామానికి చెందిన బోతొల్ల నడిపి ముత్తన్న,(45) వృత్తిరీత్యా కూలీ. అతను గత కొంతకాలంగా తీవ్రమైన కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నాడు.పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నిరంతరం వేధిస్తున్న కడుపునొప్పితో జీవితంపై విరక్తి చెందిన ముత్తన్న,ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకున్నాడు.మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన అతని సోదరుడు గంగన్న, పక్క ఇంట్లోంచి శబ్దాలు రావడంతో కిటికీలోంచి చూశాడు. ముత్తన్న ఉరికి వేలాడుతూ కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించి, వెంటనే ఇనుప గునపంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి ఉరితాడు తొలగించాడు. అయితే, స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు శంకర్ వచ్చి పరీక్షించేసరికే ముత్తన్న మృతిచెందాడు.మృతుని సోదరుడు గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking