లోకేశ్వరంలో నేత్రపర్వంగా పెద్దమ్మతల్లి 4వ వార్షికోత్సవం…

లోకేశ్వరంలో నేత్రపర్వంగా పెద్దమ్మతల్లి 4వ వార్షికోత్సవం…

 భక్తిపారవశ్యంలో మునిగితేలిన మండల కేంద్రం

పెద్దమ్మతల్లి ని దర్శించుకున్న వందలాది మంది భక్తులు…

విశేషంగా అలరించిన శివసత్తుల పూనకాలు, కోలాటాలు..

నేటితో ముగియనున్న ముక్కంటి వేడుకలు..

లోకేశ్వరం, ఆగస్టు 1 (అక్షిత న్యూస్):

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో వెలసిన శ్రీ పెద్దమ్మతల్లి 4వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత కన్నులపండువగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా, రెండో రోజైన శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు.ఉత్సవాల్లో భాగంగా ముదిరాజులు ఆలయ నిర్వాహకులు, అమ్మవారికి ఉదయం నుంచే విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారిని నవధాన్యాలు, నూతన పట్టు వస్త్రాలు,వివిధ రకాల పుష్పమాలలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. పెద్దమ్మ తల్లి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.​ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో పలు విధుల గుండా భక్తుల శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు కోలాటాలు, భజన కీర్తనల మార్మోతతో ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగితేలాయి. దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి, తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ​దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేసి, మహాతర్పణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking