పలు కుటుంబాలకు పరామర్శ

పలు కుటుంబాలకు పరామర్శ

మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్…

లోకేశ్వరం,ఆగస్టు 1 అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న బాధిత కుటుంబాలను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు లోలం శ్యాంసుందర్, ఓదార్చారు.పిప్రి.గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అనిల్, నాయకుడు రాజు,వాళ్ల నానమ్మ అనారోగ్యంతో మృతి చెందగా,విషయం తెలుసుకున్న లోలం శ్యాంసుందర్, వారి స్వగృహానికి వెళ్లారు. భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కాండ్లి గ్రామ సర్పంచ్ వెంకటేష్,నానమ్మ ఇటీవల కన్నుమూయడంతో,వారి నివాసానికి వెళ్లిన శ్యాంసుందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఈ పరామర్శ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యామ్ సుందర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ చిన్నారావు, మాజీ ఎంపీపీ సాగర్,సర్పంచ్ వినోద్,మాజీ ఎంపీటీసీ దత్తు పటేల్, మాజీ సర్పంచులు సాయన్న, దిగంబర్,మాజీ ఉప సర్పంచ్ చిన్నయ్య,బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్,డిష్ మల్లయ్య, నాయకులు దిగంబర్,అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking