మన సాoప్రదాయాలను పాటించాలి
చిట్యాల అక్షిత ప్రతినిధి
మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో గోరింటాకు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదానోపాధ్యాయుడు ఆర్ వెంకన్న మాట్లాడుతూ నేటి సమాజంలోని పిల్లలు, యువకులు మనకు ఆనాది వస్తున్న అనేక విషయాలను పాటించాలన్నారు .దాంట్లో భాగంగా పాఠశాల లో గోరింటాకు వేడుకలు నిర్వహించి దాని వెనుక ఉన్న వైజ్ఞానిక విశేషాలు తెలియజేస్తూ ఆషాఢ మాసం లో గోరింటాకును గౌరిదేవి అనుగ్రహం, సౌభాగ్యానికి ప్రతీకగా అదే విధంగా వర్షా కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను, శరీరంలో వచ్చే వేడినీ తగ్గించడానికి గోరింటాకు సహజ సిద్ధమైన ఔషధంగా పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్దన్, ఉపాధ్యాయులు యాదయ్య, శిరీష,భవాని, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
