చేనేత చైతన్య మహాసభను జయప్రదం చేయండి..
రామన్నపేట అక్షిత ప్రతినిధి
ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 5న కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని పద్మశాలి భవన్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి చేనేత మహాసభను జయప్రదం చేయాలని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి పెండెం లక్ష్మీనారాయణ, రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు బూరుగు వెంకటేశం పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంతో పాటు మండలంలోని సిరిపురం గ్రామంలో చేనేత చైతన్య మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలో 17 మంది పద్మశాలి మున్సిపల్ చైర్మన్ లను, కౌన్సిలర్లు కార్పొరేటర్లకు, నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులను సత్కరించనున్నట్లు వారు తెలిపారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ కొనగాని శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు గూడూరు శ్రీనివాస్, దూలం వెంకటరమణ, రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, రిటైర్డ్ ఐఏఎస్ పి చిరంజీవిలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని వారు తెలిపారు. పద్మశాలి ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక్షులు, వృత్తిదారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపోలు రాజశేఖర్, సిరిపురం చేనేత సహకార సంఘం అధ్యక్షులు రాపోలు షణ్ముఖం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు రచ్చ యాదగిరి, సిరిపురం పద్మశాలి సంఘం అధ్యక్షులు జేల్ల శ్రీనివాస్, డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ జెల్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ ఎంపీటీసీలు పున్న వెంకటేశం, బడుగు రమేష్, సిల్క్ చేనేత సహకార సంఘం డైరెక్టర్ మహేశ్వరం అశోక్, చేనేత నాయకులు కైరం కొండ నందు, కొంగరి నరసింహ, గంజి అశోక్, చిందం ఉమాకాంతం, తదితరులు ఉన్నారు.