మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం

మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం

జంతర్ మంతర్‌లో విద్యార్థులపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే

విద్యార్థి నాయకులపై కక్షసాధింపు చర్యలు వెంటనే విరమించుకోవాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవి కుమార్

రామన్నపేట అక్షిత ప్రతినిధి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ,ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవి కుమార్ విమర్శించారు.ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలతో దేశ ప్రజలపై భారాలు మోపుతూ, మరోవైపు ప్రజాస్వామ్య హక్కులను హరిస్తోందని ఆయన అన్నారు.రామన్నపేట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంజీ గార్డెన్‌లో నిర్వహించిన మండల స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.దేశంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు.ఈటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని, అలాంటి ఉద్యమాలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థి నాయకులపై కక్షసాధింపు చర్యలను వెంటనే విరమించుకోవాలని,అక్రమ కేసులను ఎత్తివేయాలని, ప్రజాస్వామ్య విలువలను కేంద్ర ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు.శిక్షణా తరగతులు ప్రారంభానికి ముందు సిపిఎం సీనియర్ కామ్రేడ్ పబ్బతి లింగయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కచం కృష్ణమూర్తి 20వ వర్ధంతి, మాజీ సిపిఎం మండల కమిటీ సభ్యుడు పిట్టల శ్రీనివాస్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయాలు, త్యాగస్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల హక్కుల సాధన కోసం మరింత కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు బోయిని ఆనంద్,కందుల హనుమతు, జంపాల అండాలు,కల్లూరి నగేష్, మండల కమిటి సభ్యులు గొరిగే సోములు,గన్నేబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి బాలరాజు,గాదె నరేందర్, మీర్ ఖాజా అళీ, నాగటి ఉపేందర్, వేముల సైదులు,ఎండీ రషీద్,పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్,డివైఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు శానాగొండ రాము, మెట్టు శ్రవణ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద, నాగటి లక్ష్మణ్,పులి బిక్షం, శానాగొండ వెంకటేశ్వర్లు, జితేందర్,కొమ్ము అంజమ్మ తదితరులు పాల్గొన్నారు

.

Leave A Reply

Your email address will not be published.

Breaking