అర్ధరాత్రి అడ్డగింత.. బెదిరించి దోపిడీ!
దౌర్జన్యానికి పాల్పడ్డ ‘సన్నీ’ని పట్టుకున్న లోకేశ్వరం పోలీసులు
జైలుకు నిందితుడు..కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరిక…
లోకేశ్వరం, జూలై 31 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్తున్న వాహనదారుడిని అడ్డగించి, బెదిరించి డబ్బులు గుంజుకోవడమే కాకుండా దాడికి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు లోకేశ్వరం ఎస్సై ఎల్. ప్రదీప్,తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భైంసా మండలం పెండ్’పల్లి గ్రామానికి చెందిన షేక్ అద్నాన్ (24) జులై 11న అర్ధరాత్రి సుమారు 2:00 గంటల సమయంలో సాథ్’గాం నుంచి లోకేశ్వరం వైపు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో రాజూర గ్రామానికి చెందిన పల్లె సన్నిత్ అలియాస్ సన్నీ,(31)అతడిని అడ్డుకట్ట వేసి,భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా బాధితుడిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడని.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబరు 88/2026 కింద భారతీయ న్యాయ సంహిత ( భైంసా) సెక్షన్లు 118(2), 324(4), 308(2) ప్రకారం కేసు నమోదు చేశారు.దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు గురువారం నిందితుడు సన్నీ,ని పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.ఎవరైనా బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, దాడుల వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్వరం ఎస్సై ఎల్. ప్రదీప్, హెచ్చరించారు…