దివ్యాంగుల పెన్షన్ మరో వెయ్యి పెంపు

విక‌లాంగుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్.. పెన్ష‌న్ ఇక రూ. 4,116

మంచిర్యాల, అక్షిత బ్యూరో :

రాష్ట్రంలోని విక‌లాంగుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. తెలంగాణ‌లోని విక‌లాంగుల‌కు ఆస‌రా పెన్ష‌న్లు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. పెంచిన పెన్ష‌న్లు వ‌చ్చే నెల నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. మొత్తం తెలంగాణ స‌మాజం బాగుండాలి అని కేసీఆర్ పేర్కొన్నారు. ముస‌ల‌మ్మ‌లు, ముస‌లి తాత‌లు ఆస‌రా పెన్ష‌న్ల‌తో బ్ర‌హ్మాండంగా ఉన్నారు. విక‌లాంగుల‌కు రూ. 3,116 పెన్ష‌న్ ఇస్తున్నాం. ఇవాళ మంచిదినం. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంలో విక‌లాంగుల పెన్ష‌న్ కూడా పెంచ‌బోతున్నాం. మ‌రో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గ‌డ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్ర‌క‌టించాల‌ని నేను స‌స్పెన్ష‌న్‌లో పెట్టాను. వ‌చ్చే నెల నుంచి రూ. 4,116 పెన్ష‌న్ అందుతుంది. అంద‌రి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking