వర్క్ ఫ్రమ్ బైక్.. సీపీ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్ అక్షిత బ్యూరో
వర్క్ ఫ్రమ్ పేరుతో ఓ వ్యక్తి రోడ్డుపై బైక్ నడుపుతూ.. దానిపై లాప్ టాప్ పెట్టుకొని వెళ్తున్న తాజాగా వీడియో వైరల్ అవుతోంది. దీనిపై హైద రాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్లపై ప్రయాణిస్తూ ఆఫీస్ పనులు చక్కబెట్టే ‘వర్క్ ఫ్రమ్ బైక్’ వెర్రితనంపై సీరియస్ అయ్యారు. ‘ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదికి వస్తుంది’ అనే సామెతను గుర్తు చేస్తూ.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారుడి ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది వారి ప్రాణాలకే కాకుండా పక్కన వెళ్లే ఇతర అమాయక ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పని హెచ్చరించారు. కడుపు నింపుకోవ డానికి చేసే ఉద్యోగం, ప్రాణాలు కడతేర్చేలా ఉండకూడదని ఆయన ఉద్యో గులకు హితవు పలికారు. దయచేసి రోడ్డుపై ల్యాప్టాప్ లు ఓపెన్ చేయడం, ఫోన్లు మాట్లాడడం వంటి పనులు మానేయాలని పిలుపునిచ్చారు.