డ్రైవర్ గా మారిన ముఖ్యమంత్రి..

డ్రైవర్ గా మారిన ముఖ్యమంత్రి..

 

హైదరాబాద్ అక్షిత బ్యూరో 

 

తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే చీఫ్ విజయ్ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. పరిపాలనలో కొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా తన ప్రణాళికలు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన కర్ణాటక కొల్లూరులోని మూకాంబికా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించడం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే ఈ పర్యటన సందర్భంగా విజయ్ చేసిన ఫీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత విజయ్ ఒక్కసారిగా డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆలయం నుంచి విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్లు కాన్వాయ్లో తాను ప్రయాణించే కారును స్వయంగా విజయ్ డ్రైవ్ చేశారు. అంతే కాదు మార్గ మధ్యలో ఒక టోల్దేట్ వద్ద అభిమా నులు విజయ్ను గుర్తు పట్టి చేతులు ఊపగా అందుకు బదులుగా డ్రైవింగ్ సీట్లో ఉన్న విజయ్ సైతం అభివాదం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking