గ్రామాభివృద్ధిలో ఉపసర్పంచ్ల పాత్ర కీలకం
జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి
ఉప సర్పంచ్ల ఫోరం రామన్నపేట మండల అధ్యక్షుడిగా మోటి రమేష్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచ్లు కీలక పాత్ర పోషిస్తారని జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి అన్నారు. రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప సర్పంచ్లు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఉప సర్పంచ్లకు ప్రత్యేక విధులు అప్పగించడంతో పాటుగా గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. అనంతరం ఉపసర్పంచ్ల మండల కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షులు మోటి రమేష్,ఉపాధ్యాక్షులు తర్పాల అయిలయ్య,నల్ల జయసుధ, ప్రధాన కారదర్శి సంకబుడ్డి సైదులు యాదవ్, కార్యదర్శి నీల నర్మింహో,నాడిగోటి పండు, కోశాధికారి మూడుదూడ్ల అనూష,సహయ కారదర్శి చొప్పం నర్సింహా,సందెనబోయిన మహేశ్వరి రవి, బైకని ఉమా,ప్రచార కార్యదర్శి గుండాల రమేష్ నన్నురి. ఉపేందర్ రెడ్డి లు ఎన్నికైనారు.
పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తాం
– ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మోటి రమేష్
ఉప సర్పంచ్ ఫోరం రామన్నపేట మండల అధ్యక్షుడిగా రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ చెందిన మోటి రమేష్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల సమగ్ర అభివృద్ధి గ్రామాల పురోభివృద్ధి, ప్రజల సంక్షేమం మంచి పరిపాలన సాధ్యమయ్యే విధంగా సమిష్టి కృషిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోరం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మోటి రమేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నికైనందున బాధ్యత మరింత పెరిగిందని, అందరి సహకారంతో మండల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
