మన సంక్షేమం దేశానికి దిక్సూచి

మన సంక్షేమం దేశానికి దిక్సూచి

– మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షితప్రతినిధి :
సబ్బండవర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దశాబ్దిఉత్సావాలను పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణం శ్రీమన్నారాయణ పంక్షన్ హాల్ లోనిర్వహించిన సంక్షేమ సంబరాలు కార్యక్రమంలో ఆయన పాల్గొనిమాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పధకాలు లబ్దిపొందిన లబ్ధిదారుల మాటల్లో నిజాయితీ కళ్ళలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుందన్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమన్నారు. పేదల సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ నిత్యం ఆలోచిస్తూ ప్రతి గడపకు పథకం చేరేలా చక్కటి కార్యాచరణతో అమలు చేస్తున్నారని, నేడు రాష్ట్రంలో లబ్దిపొందని కుటుంబం లేదని అన్నారు. నాడు పేదలకు అరకొరగా అందుతున్న పథకాలు నేడు పథకాల అమలుతో పాటు తగిన బడ్జెట్ కేటాయిస్తూ అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేర ఒక్కో రంగంలో సాధించిన ప్రగతిపై 21 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

నాడు గ్రామంలో ఒకరు చనిపోతే మరొకరి పింఛన్ వచ్చేదని, కానీ నేడు పింఛన్ వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించి బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఫైలేరియా, డయాలసిస్ రోగులకు కూడా పింఛను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతంచేసేందుకు గురుకులపాఠశాలలు,విదేశ విద్యకు 20 లక్షల ఆర్థికసహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. అందరికిఅన్నంపెట్టే రైతాంగానికి రైతు బందు, రైతు భీమా, సాగునీటికి చెక్ డ్యాంల నిర్మాణం, మిషన్ కాకాతీయద్వారా చెరువుల పూడిక తీత పనులను చేపట్టడం జరిగిందన్నారు , పేదింటి ఆడపిల్లల కు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ వంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. రాష్జంలోసబ్బండవర్గాలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసిఆర్ అని కొనియాడారు. ఆర్థికంగా వెనుకబడిన దళితులకు దళిత బందు పథకం అమలు చేసినట్లే బి సి కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తూ వారి సంక్షేమాన్ని కాంక్షించి కార్యక్రమాలకు రూపకల్పన చేసి అందుకు తగిన విధంగా నిధులు కేటాయిస్తూ అమలు చేస్తున్నదని అన్నారు. నాటితో పోలిస్తే నేడు 200 నుండి 2,106 రూపాయలకు పింఛన్ల పెంపు, 50 వేల నుండి రెండున్నర లక్షల రూపాయలకు కులాంతర వివాహక ప్రోత్సహకాలు అందిస్తుందన్నారు . నేడు ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు అమలవుతుండడం, శాంతి భద్రతలు అదుపులో ఉండడం, అందరు కలిసికట్టుగా ఉండడం ద్వారా గ్రామాలు పట్టణాలు ఆర్థికంగా బలపడుతున్నాయని, ఇది అభివృద్ధికి సూచిక అని అన్నారు. చేతివృత్తుల చెయుతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ బి సి ల లోని కులవృత్తులకు చెందిన కుటుంబానికి లక్ష చొప్పున ఆర్దిక సహాయం అందజేయు పధకాన్ని ప్రారంభించి మిర్యాలగూడ నియోజకవర్గంలో బి సి కార్పొరేషన్ ద్వారా కుటుంబానికి లక్ష చొప్పున 6 కుటుంబాలకు మంజూరు అయిన చెక్కులను పంపిణి చేసారు.రెండో విడత గొర్రెల పంపిణి పధకంలో భాగంగా 24 కుటుంబాలకు గొర్రె పిల్లల యూనిట్లను లబ్దిదారులకు పంపిణి చేశారు.సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ళు కట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గృహలక్ష్మి పథకం కింద మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని 15 మంది లబ్దిదారులకు ఆర్దిక సహాయాన్ని అందజేశారు.కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు 2,50,000 రూపాయల చొప్పున 15 మంది జంటలకు మంజూరైన ఆర్థికసహాయం చెక్కులను అందజేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకంకింద మిర్యాలగూడ నియోజక వర్గ వ్యాప్తంగా 218 మందికి మంజూరైన 2 కోట్ల 18 లక్షల 25 వేల 288 రూపాయల విలువ గల చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేశారు.మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 43 మందికి మంజూరు అయిన చెక్కులను మరో వారం రోజుల లోగ పంపిణి చేయనున్నట్టుఎమ్మెల్యే తెలిపారు.ఈకార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడినారాయణరెడ్డి, ఎంపిపిలు నూకల సరళ హనుమంతు రెడ్డి, ధీరావత్ నందిని రవితేజ, ధనవాత్ బాలాజీ నాయక్, పోకల శ్రీవిద్యారాజు ఆర్డిఓ చెన్నయ్య, జడ్పీటీసీ లు అంగోతు లలిత హతిరాం నాయక్, కుర్రా సేవ్యా నాయక్, జెడ్పికో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ మోసిన్అలీ మాజీ ఎంపిపి లు తిరుపతమ్మ, కురాకుల మంగమ్మ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి, తోపాటు మండల పార్టీ అద్యక్షులు, మండల రైతు బంధు అధ్యక్షులు, వైస్ ఎంపిపిలు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్లు,ఎంపిడిఓలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking