*ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి*
దిర్శించర్లలో బడిబాట
నేరేడుచర్ల, అక్షిత న్యూస్ :
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తగిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలతో పాటు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని గ్రామ సర్పంచ్ మాగంటి మాధవి తల్లిదండ్రులను కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని దిర్శించర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు మార్కుల మెమోలను పంపిణీ చేసి ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు ఐదువేల రూపాయలు నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి సభ్యులు కుంటిగొర్ల సైదులు, మాగంటి సైదులు, ఉపాధ్యాయులు జె శ్రీనివాస్, విజయ్ కుమార్, యాదగిరి, వెంకటకృష్ణ, శంకర్, సైదులు, సతీష్, శ్రీను పాల్గొన్నారు.