ఆరోగ్య పరిరక్షణ… అందరి బాధ్యత

ఆరోగ్య పరిరక్షణ… అందరి బాధ్యత
12న తుంగతుర్తిలో హెల్త్ క్యాంప్

కృష్ణవేణి ఫౌండేషన్ చైర్మన్ కృష్ణవేణి ఇస్మాయిల్

తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి :
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం మనందరి భాద్యతని కృష్ణవేణి ఫౌండేషన్ చైర్మన్ కృష్ణవేణి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. శుక్రవారం నూతన్ కల్ మండల కేంద్రoలోని అంబేద్కర్ సెంటర్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కృష్ణవేణి ఫౌండషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామని, అపోలో స్పెక్ట్రా అమీర్ పేట్ సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఇవాళ ఈ హెల్త్ క్యాంపుకు సంబంధించిన కరపత్రాలను కృష్ణవేణి ఫౌండషన్ ఛైర్మెన్ కృష్ణవేణి, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ లు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా కృష్ణవేణి మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకోసం ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, తుంగతుర్తి నియోజక ప్రజలు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిరుపేదల కోసం ఈ హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యoగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రమేష్, శంభారెడ్డి, సాయికుమార్, యువజన నాయకులు మరికంటి రమేష్, నవీన్ మరికంటి, పిట్టల మహేష్, దేవేందర్, బద్దం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking