నీటి వనరులకు నీరాజనం

నీటి వనరులకు నీరాజనం

* చుక్కనీటి కోసం అల్లాడిన

నేలకు ప్రతినిత్యం జలాభిషేకం

గుత్తా, భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు చుక్కనీటి కోసం అల్లాడిన నేలకు ఇప్పుడు ప్రతినిత్యం జలాభిషేకం జరుగుతున్నదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం సాగు నీటి రంగంలో అబ్బురపరిచే విజయాలను సొంతం చేసుకుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలోని నాగుల చెరువులో నిర్వహించిన “ఊరూరా –చెరువు” పండుగ కార్యక్రమంలో పాల్గొని గ్రామ బొడ్రాయి వద్ద కొబ్బరికాయలు కొట్టి గ్రామస్తులతో కలిసి చెరువ వద్దకు చేరుకుని బతుకమ్మ ఆటలు ఆడి బతుకమ్మలను చెరువులో వదిలారు. అనంతరం మహిళల కోలాట ప్రదర్శనను తిలకించారు. అనంతరం వారు మాట్లాడారు. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరామ్ సాగర్, శ్రీరామ్ సాగర్ రెండో దశ, వరద కాలువ, ఎల్లంపల్లి, సీతారామ ఎత్తిపోతల, కల్వకుర్తి,భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంబురాలు నిర్వహించుకున్నారని అన్నారు. గత పాలకులు నీళ్లు లేని చోట్ల కాలువలు తవ్వి కాంట్రాక్టర్ల జేబులు నింపారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జల విధానం యావత్ ప్రపంచానికే మాడల్ గా మారిందన్నారు. గోదావరిలో వృథాగా పోతున్న నీటిని కాళేశ్వరం వద్ద ఒడిసిపట్టి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వార్స్ వరద కాలువల మీదుగా ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్టును నింపుతున్నామని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking