రాష్ట్రస్థాయి వ్యాసరచనలో రామన్నపేట విద్యార్థిని ప్రతిభ
ద్వితీయ స్థానం సాధించిన అక్షయ
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని వై. అక్షయ రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి ప్రతిభ చాటింది. యు అండ్ మీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె విజయం సాధించింది.హైదరాబాద్‌లో నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కళాశాల విద్యా కమిషనర్ దేవసేన చేతుల మీదుగా అక్షయ పురస్కారం స్వీకరించింది.ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ మాట్లాడుతూ… రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవడం ఆనందించదగ్గ విషయమని, కళాశాలకు గర్వకారణమని తెలిపారు.అక్షయ సాధించిన విజయంపై అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.