పెట్రోల్‌, డీజిల్ కటకట మూతపడ్డ బంకులు

పెట్రోల్‌, డీజిల్ కటకట మూతపడ్డ బంకులు

కంపెనీల నుంచి తగ్గిన సరఫరా

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

మాజీ వైస్ ఎంపీపీ సిపిఎం పార్టీ నాయకులు నాగటి ఉపేందర్ 

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

పెట్రోల్‌, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ సిపిఎం పార్టీ నాయకులు నాగటి ఉపేందర్ అన్నారు. వారు మాట్లాడుతూ మండలంలో గత 3 రోజులుగా మొదలైన ఈ కొరత సోమవారం నాటికి తీవ్రమైంది. ఇంధన కొరతతో రామన్నపేట మరియు చుట్టుపక్కల మండల ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో చాలాచోట్ల బంకులు మూతపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు స్టాక్‌ ఉన్న బంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడ్డ పరిస్థితి నెలకొంది. పనులు మానుకొని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు పౌరసరఫరాల శాఖ ఈ పరిస్థితిపై దృష్టి సారించి పెట్రోల్ డీజిల్ కొరత తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము

Leave A Reply

Your email address will not be published.

Breaking