రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి

రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి.

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ అనురాధకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ… 619 సర్వే నంబర్ల పరిధిలోని లోతుకుంట భూమి అక్రమ కబ్జాకు గురవుతోందని ఆరోపించారు. సిమెంట్ ఇటుక తయారీ పేరుతో ఆక్రమణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భూమిని సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే 7వ వార్డులో అసంపూర్తిగా ఉన్న మోరీలను పూర్తి చేయాలని, 14వ వార్డులో కోర్టు కాలనీ నుంచి పెద్ద మోరీ వరకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని కోరారు. అమ్మనబోలు రూట్‌లో మోకాళ్ల సోమయ్య ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న మోరీని సరిచేయాలని, సకరికుంట నుంచి ఆసుపత్రి వరకు వరద కాలువ నిర్మించాలని తెలిపారు.12వ వార్డులో పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని, మాజీ సర్పంచి మొగులయ్య ఇంటి వద్ద అసంపూర్తిగా ఉన్న మోరీని పునరుద్ధరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పల్లె సత్యం, వెంకట్ రెడ్డి, బావడ్లపెళ్లి సత్యం, గంజి అశోక్, బొల్ల వెంకటేశ్వర్లు, రాసాల రమేశ్, నకిరేకంటి సురేశ్, మునుకుంట్ల రాణి, కుందూరు వెంకటేశ్వర్లు, గొరిగే మల్లేశం, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking