రామన్నపేటలో ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో పార్టీని స్థాపించిన కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. రాష్ట్రం సాధించిన అనంతరం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య, జిల్లా నాయకుడు ఎస్‌కే చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, ఉప సర్పంచ్ చొప్పరి నరసింహ, నాయకులు నోముల యాదగిరి, దుండగుల సమ్మయ్య, నక్క నరేందర్, జాల అమరేందర్ రెడ్డి, జెట్టి శివప్రసాద్, నల్ల సైదులు, ఆవుల శ్రీధర్, చిప్పలపల్లి రవి, గాదె శంకర్, వర్కల రమేష్, ఎండీ హరీప్, బైరు హరికృష్ణ, వర్కల మల్లేష్, ఎర్రబోయిన సత్తయ్య, గట్టు ముత్తయ్య, పోషబోయిన నాగరాజు, ఏసబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.