పల్లపు బుద్ధుడు సహకారంతో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో ఎండలో పనిచేస్తున్న ఉపాధిహామీ కూలీలకు వడదెబ్బ కొట్టకుండా కాంగ్రెస్ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు సహకారంతో సోమవారం నాడు జన్నపాల రాము కూలీలకు మధ్యా హ్న భోజన విరామ సమయంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.పల్లపు బుద్ధుడు కు ఉపాధి హామీ కూలీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, జన్నపాల రేణుక, రాచమళ్ళ సంధ్య, గురిజ మమత, రూపని వనజ, ఉయ్యాల లక్ష్మయ్య పాల్గొన్నారు.